Tuesday, November 26, 2024

ముల్కీ- నాన్ ముల్కీ ఆవిర్భావం

- Advertisement -
- Advertisement -

ముల్క్ అంటే దేశం లేదా రాజ్యం అని, ముల్కీ అంటే దేశీయుడు లేదా స్థానికుడు అని అర్థం.
బహమనీల కాలంలోనే ముల్కీ లొల్లి
బహమనీ రాజుల కాలంలోనే ముల్కీ ఉద్యమానికి బీజం పడింది

NCDC Team arrives Hyderabad for New Lab
బహమనీ రాజ్యంలో ప్రధానులు
1. హసన్ (అపాకి)
2. మహ్మద్ గవాన్ (అపాకి)
నోట్: అపాకి (గైర్ ముల్కీలు) అంటే విదేశీయుడు లేదా స్థానికేతరుడు అని అర్థం.
హసన్ గుజరాత్‌పై దాడి చేసినప్పుడు దక్కనీ సైన్యం సహకరించక ఓటమి పాలయ్యాడు.
దీనిని ఆసరాగా తీసుకున్న గుజరాత్ సైన్యం హసన్‌తో పాటు చాలా మంది సైన్యాన్ని హతమార్చింది.
మూడవ అహ్మద్ షా కాలంలో ప్రదాని మహ్మద్ గవాన్.
మహ్మద్ గవాన్ బీదర్‌లో పెద్ద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి అపాకీ విద్యార్థులకు, అపాకీ భోదకులకు అవకాశం ఎక్కువగా ఇచ్చారు.
గవాన్ సంస్కరణల వల్ల ఎక్కువగా దక్కన్‌లు నష్టపోయారు.
బీదర్ పట్టణంలో దక్కన్‌లకు అపాకీలకు తీవ్ర ఘర్షణలు జరిగి చాలా మంది మరణించారు.
నోట్: బహమనీ రాజ్యం 1527లో అంతరించింది.
అంతః కలహాల కారణంగా బహమని సామ్రాజ్యం విచ్ఛిన్నం అయి 5 స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి.
అవి 1. బీజాపూర్ అదిల్‌షాహి వంశం
2. బీదర్ బీదర్ షాహి వంశం
3. బెరార్ ఇమాద్‌షాహి వంశం
4. అహ్మద్‌నగర్ నిజాంషాహి వంశం
5. గోల్కొండ కుతుబ్ షాహి వంశం
కుతుబ్‌షాహీల కాలం
కుతుబ్‌షాహి సామ్రాజ్య స్థాపకుడు కులీకుతుబ్‌షా (అపాకి, ఇరాన్ నుండి వచ్చాడు)
బహమని సామ్రాజ్యం విచ్చిన్నం తర్వాత గోల్కొలండ కేంద్రంగా ఏర్పడిన కుతుబ్‌షాహి వంశస్తులు స్థానికులకు ఎక్కువ అవకాశాలిచ్చారు.
స్థానిక భాష తెలుగును ప్రోత్సహించారు. కవులను ఆదరించారు.
హిందువులైన అక్కన్నకు సర్వసైన్యాధ్యక్ష పదవి, యాదన్నకు ప్రధానమంత్రి పదవి ఇచ్చారు.
ఇలా హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వీరి కాలంలో ముల్కీ సమస్య తలెత్తలేదు.
అసఫ్ జాహీల కాలం
వీరి కాలంలో ముల్కీ నాన్ ముల్కీ వివాదాలు తలెత్తి మూడు దశలుగా జరిగాయి
మొదటి దశ 18571883, రెండో దశ 1884 1911, మూడో దశ 19111948
నిజాం అఫ్జలుద్దౌలా (18841869) కాలంలో ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమ రూపం దాల్చింది.
అఫ్జలుద్దౌలా కాలంలో ముల్కీ సమస్య రావడానికి గల కారణాలు
మొదటి దశ (1857-83)
మొగల్ సామ్రాజ్యం అంతరించిన అనంతరం
1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొగల్ సామ్రాజ్యం అంతరించడంతో కొందరు .. లక్నో, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, ముర్షిదాబాద్ మొదలగు రాజ్యాల నుండి నిజాం రాజ్యంకు వలస వచ్చి ఉన్నతపదవులు పొంది..ముల్కీల అవకాశాలను చేజిక్కించుకున్నారు.
వలస వచ్చిన వారిలో మస్లింలు అత్యధికంగా ఉండటంతో వారికి పార్సి, ఉర్ధూ భాషలు అనుకూలించాయి.
సాలర్‌జంగ్ 1 హైదరాబాద్ ఆధునీకరించే ప్రక్రియ:
ఆధునీకరణలో భాగంగా సంస్కరణలు సక్రమ అమలు కోసం అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి విద్యావంతులను హైదరాబాద్‌కు ఆహ్వానించాడు
హైదరాబాద్ వలసవచ్చి ఎక్కువగా ఉద్యోగాలు పొందినవారు కామస్తులు, కట్రిలు.
ఆలీఘర్ ముస్లిం మున్సిపాలిటి వ్యవస్థాపకుడు సయ్యద్ మహ్మద్ ఖాన్
ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటి నిర్మించబడిన సంవత్సరం 1875 మె 24
సయ్యద్ మహ్మద్‌ఖాన్ కొద్ది రోజులు సాలార్‌జంగ్ 1సహాయకుడిగా పనిచేశాడు.
సాలార్‌జంగ్ 1కు మరొక సహాయకుడు అమీనుద్దిన్ ఖాన్
సయ్యద్ మహ్మద్ ఖాన్, అమానుద్దిన్‌ఖాన్‌లు హైదరాబాద్‌కు గైర్‌ముల్కీలను రప్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
నాన్ ముల్కీలు అవసరం లేకున్నా తమ శాఖలను విభజించి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తూ బందువులను, స్నేహితులను హైదరాబాద్ రప్పించి ఉద్యోగాలు ఇచ్చే వారు.
గైర్ ముల్కీలు స్థానిక ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి వెళ్లి పోకుండా ఇక్కడే ఉండడం వల్ల ముల్కీలకు ఉద్యోగాలు లేక ఉద్యమం ప్రారంభమైంది.
బ్రిటీష్ ఇండియా నుండి వచ్చిన, గైర్ ముల్కీలు ఆంగ్ల విద్యను అభ్యసించడంతో పాటు, పాశ్చాత్య సంస్కృతిని అనుసరించారు.
దక్కన్ సంస్కృతిని, మొఘల్ సాంప్రదాయాన్ని రక్షించడంలో, గైర్ ముల్కీలు ప్రముఖులను కలవకుండా సాలార్‌జంగ్ 1 కఠిన నిబంధనలు విధించారు.
గైర్ ముల్కీలు హైదరాబాద్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ముల్కీలపై అజమాయిషి చేస్తూ పెత్తనం చేలాయించేవారు.
సాలార్‌జంగ్ 1 గైర్ ముల్కీలపై విధించిన ఆంక్షలు
నిజామ్ కుటుంబానికి , దివాన్ రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలకు నాన్‌ముల్కీ అధికారులను దూరంగా ఉంచేవారు.
ప్రముఖుల ఫంక్షన్స్‌కి నాన్ ముల్కీలు హాజరు కాకుండా ఆంక్షలు విధించారు.

6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనలో ముల్కీ-నాన్‌ముల్కీ వివాదాలు
ఫిబ్రవరి 5, 1884న ఆరవ నిజాం పాలనా బాధ్యతలు స్వీకరించారు.
అక్టోబర్ 31, 1883న మీర్ లాయక్ అలీఖాన్‌కు సాలార్‌జంగ్ 2 హొదాను నిజాం ప్రభుత్వం బహుకరించింది.
ఫిబ్రవరి 5, 1884న సాలార్‌జంగ్ 2 ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు
సాలార్‌జంగ్ 2, ఫిబ్రవరి 21, 1884న నాన్ ముల్కీల ఒత్తిడికి లోనై ఉర్ధూను హైదరాబాద్ సంస్థానపు అధికార భాషగా ప్రకటిస్తూ ఆదేశాలిచ్చారు.
ఉర్ధూ అధికార భాషకావడం, ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత పెరగడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
ఈ కాలంలో నాన్‌ముల్కీలు స్థానిక ఉద్యోగాలు చేపట్టారు.
సాలార్‌జంగ్ 2 మద్ధతుతో నాన్ ముల్కీ అధికారుల ఆదిపత్యం నిజాంప్యాలెస్ తోపాటు నిజాం కోర్టులోనూ మొదలైంది.
1884 తర్వాత అత్యధిక ఉద్యోగాలు చేపట్టినది నాన్‌ముల్కీలు
ఈ సమస్య ఆరవ నిజాంకు చేరడంతో ప్రభుత్వంలోని సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పట్టికను వారి పుట్టిన స్థలం ఆధారంగా తయారు చేసివ్వాలని సాలార్‌జంగ్ 2ను ఆదేశించారు.
1884లో తొలిసారిగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహించారు.
సివిల్ సర్వీసెస్ తొలిజాబితా ప్రకారం ముల్కీలు 246, నాన్‌ముల్కీలు 230 మంది ఎంపికయ్యారు.
1886 ఉద్యోగుల సాధారణ జాబితా (సివిల్స్ లిస్ట్)
సివిల్ సర్వీసెస్ తొలి జాబితా ప్రకారం ముల్కీలు 52శాతం ఎంపిక కాగా, వారి వేతనాల మొత్తం 42 శాతం.
ఈ జాబితాలో నాన్ ముల్కీలు 48 శాతం ఎంపిక కాగా వారి వేతనాల మొత్తం 58 శాతం ఉన్నట్లు సాలార్‌జంగ్ 2 ఇచ్చిన జాబితా వెల్లడించింది.
అక్టోబర్ 1884 నుండి వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమైన వారి వివరాలు అందించాలని సాలార్‌జంగ్ 2ను నిజాం ఆదేశించారు.
1886 జాబితా వివరాలు
మొత్తం నియామకాలు 421
హైదరాబాద్ స్థానికులు 274 (వీరికి లభిస్తున్న వేతనాల మొత్తం 37 శాతం)
నాన్‌ముల్కీలు 147 (వీరికి లభిస్తున్న వేతనాల మొత్తం 63 శాతం)
ఈ పద్ధతిని అవలంభించిన ఇతర శాఖలు జ్యుడిషియరి, సర్వే, విద్యాశాఖ.
1887 ఏప్రిల్‌లో సాలార్‌జంగ్ 2 తనపదవికి రాజీనామా చేశాడు.
ఉద్యమాన్ని నియంత్రించడానికి ఆరవ నిజాం 1888లో గెజిట్ ప్రకటించారు.

నిజాం పాలకుల అధికార భాష పర్షియన్

పర్షియన్ స్థానంలో ఉర్ధూను అధికారభాషగా మార్చాలని ఉత్తరభారతదేశ ముస్లింలు సాలార్‌జంగ్ 1ని కోరారు.
తాను బ్రతికున్నంతకాలం పర్షియన్ భాష బ్రతికే ఉంటుందని, అధికార భాష మార్చలేనని సాలార్‌జంగ్ 1 పేర్కొన్నాడు.
సాలార్‌జంగ్ అంటే బ్యూటీఫుల్ లేదా లీడర్ ఇన్ వార్ అని అర్థం.
నాన్ ముల్కీల ప్రాధాన్యతను తగ్గించడానికి ముల్కీలను మంత్రులుగా నియమించాడు
1869లో ప్రముఖుల కుటుంబాలకు చెందిన యువకులను మంత్రులుగా నియమించారు.
ఈ మంత్రులకు అనుబంధం లేక పోవడంతో సహాయంగా కార్యదర్శులను నియమించారు.
హైదరాబాద్ ప్రముఖులతో, నాన్‌ముల్కీ ఉద్యోగులను, బ్రిటీష్ అధికారులను కలవకుండా ఆంక్షలు పెట్టారు.
హైదరాబాద్ పాతనగరపు రాతి ప్రహరిగోడలోనికి బ్రిటీష్ వారిని అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించారు.
అదుపులో లేని సాయుధ అసాంఘిక శక్తులవలన యురోపియన్లకు, బ్రిటిష్ అధికారులకు రక్షణ ఉండదని అందుబల్ల ఆంక్షలు పెట్టానని సాలార్‌జంగ్ నచ్చచెప్పారు.
హైదరాబాద్ పాతనగరపు సంస్కృతి, సాంప్రదాయాలు బ్రిటిష్ యూరోపియన్ కల్చర్‌తో కలుషితం కారాదని సాలార్‌జంగ్ ఆలోచన.
సాలార్‌జంగ్1 1883 ఫిబ్రవరి 8న కలరావ్యాధితో మరణించాడు.

వెంకటరాజం బొడ్డుపల్లి,
రామప్ప అకాడమీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News