- Advertisement -
హఖ్ఖాని నుంచి అధికారిక భద్రతకు నిరాకరణ
న్యూఢిల్లీ: తాలిబన్ ప్రభుత్వ ఉపప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తిరిగి కాబూల్ వచ్చారు. ఆయన విధులను స్వీకరించినప్పటికీ ఆంతరంగిక మంత్రి సిరాజుద్దీన్ హఖాని నుంచి భద్రతను తీసుకోలేదు.కాబుల్ నుంచి అందిన సమాచారం ప్రకారం కాబుల్‌లో హఖ్ఖాని వర్గంతో జరిగిన పోరులో బరాదర్ గాయపడ్డారు. బరాదర్ తన సెక్యూరిటీని తానే తెచ్చుకుని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నుంచి భద్రతను నిరాకరించారని తెలుస్తోంది. ఇదిలావుండగా బరాదర్ ఇప్పుడు కాబుల్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ఆయనను బలపరిచే వక్తి, రక్షణ మంత్రి ముల్లా యాకుబ్ ఇప్పటికీ కాందహార్‌లోనే ఉన్నారు.
తాలిబన్ సహవ్యవస్థాపకుడు అయిన బరాదర్ తిరిగి రావడంతో ప్రభుత్వంలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఐఎస్‌ఐ ఊతం ఉన్న హఖ్ఖాని వర్గానికి అధికారంలో ఉన్న యాకుబ్ వర్గం ప్రతిద్వందిగా ఉండనుంది. ఇదిలావుండగా దోహా శాంతి ప్రక్రియలో పాల్గొన్నవారి తొలి చర్య ఎలావుండనుంది, అఫ్ఘానిస్థాన్‌లో మానవహక్కుల పరిస్థితి ఎలా ఉండనుందని భారత్ వేచి చూస్తోంది.