Sunday, December 22, 2024

కృష్ణపట్నం, హైదరాబాద్ మధ్య మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో, ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో.. ప్రధాని మోడీ చేతుల మీదుగా రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.505 కోట్లతో నిర్మించిన మునీరాబాద్,- ప్రాజెక్టులో భాగమైన.. ‘జక్లేర్ -కృష్ణ’ కొత్త లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-, గోవా మధ్య 102 కిలోమీటర్ల దూ రం తగ్గుతుంది. కృష్ణ స్టేషన్ నుంచి ‘కాచిగూడ ,- రాయచూర్, – కాచిగూడ’ డెమూ సర్వీస్‌ను ప్రారంభిస్తారు. జా తీయ రహదారులకు సంబంధించిన రూ. 6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్ 365 బిబిలో భాగమైన సూర్యాపేట- ఖమ్మం నాలుగు లైన్ల రహదారిని ప్రారంభిస్తారు. దీంతో పాటుగా రూ.2,661 కోట్ల విలువైన.. హసన్ (కర్ణాటక), – చర్లపల్లి హెచ్‌పిసిఎల్ ఎల్‌పిజి పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వా రా.. 37లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ అందించే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో 230 కిలో మీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జిల్లాలోనే 130 కిలోమీటర్ల మేర ఉంటుంది. రూ. 1,932 కోట్లతో.. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ మధ్య ‘మల్టీ ప్రాడక్ట్ పైప్‌లైన్’కు (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్) శంకుస్థాపన చేస్తారు.

సెంట్రల్ వర్సిటీలో రూ.81.27 కోట్లతో…
ప్రధాని రాష్ట్రానికి మరో కానుకను అందించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.81.27 కోట్లతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారు. దేశంలో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ ‘హీరా’ మోడల్ ( వేస్, ఇన్ఫోవేస్, రైల్వేస్, ఎయిర్‌వేస్) అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన (1.10లక్షల కోట్లు) జాతీయ రహదారులను కేటాయించారు. మరో 2200 కిలోమీటర్ల హైవేలు నిర్మాణంలో ఉన్నాయి. నిజామాబాద్ పర్యటనలో రూ. 8021 కోట్ల ప్రాజెక్టులను ప్ర ధాని ప్రారంభించడం, జాతికి అంకితం చేస్తారు. రామగుండంలోని ఎన్‌పిటిసిలో రూ.6వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకి తం చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగిస్తారు. డిసెంబర్ నాటికి రెండో ప్రాజెక్టు కూడా పూర్తికానుంది. పునరుత్పాద విద్యుత్ (రిన్యువబుల్ ఎనర్జీ)కు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు.

496 బస్తీ దవాఖానాలు
రాష్ట్రంలో రూ. 1,369 కోట్లతో.. 496 బస్తీ దవాఖానా లు, 33ఇంటిగ్రేటెడ్ పబ్లిక్‌హెల్త్ లేబొరేటరీస్‌తో పాటుగా 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో.. 50/100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించాలనేది ప్రధానమంత్రి మోడీ సంకల్పం అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 20 జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ. 516.5 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) పూర్తయిన.. ధర్మాబాద్ (మహారాష్ట్ర) -మనోహరాబాద్, మహబూబ్‌నగర్,కర్నూల్ రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారు. రూ. 1200 కోట్లతో 76 కిలోమీటర్ల మీర నిర్మించిన మనోహరాబాద్-, సిద్దిపేట కొత్త రైల్వే లైనును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన త్వరలోనే చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రీజనల్ రింగు రోడ్డు తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇవ్వలేదని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News