Thursday, January 23, 2025

వైద్య, ఆరోగ్య శాఖలో 1520 కొలువులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో 1,520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఇప్పటికే నర్సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, తాజాగా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ విభాగంలో ఖాళీగా ఉన్న 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్ mhsrb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పంచుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆశావహులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News