Monday, January 20, 2025

మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులున్నాయి?… జాగ్రత్త!!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వం ప్రతి ఐదేళ్లలో ప్రజలకు ఏదో ఒక మెలిక పెడుతోంది. ఇప్పుడు తాజాగా సిమ్ కార్డుల పరిమితి పై దృష్టి సారించింది. గతంలో గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉంటే సరిపోయేది. తర్వాత రాను రాను నియమాలు పెంచేశారు. గతంలో రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కేస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటుండేవి. వాటి తర్వాత రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అంటూ నియమాలు పెంచేశారు.

ఇప్పుడు తాజాగా మీకు ఎన్ని సిమ్ కార్డులు ఉండాలో ఆంక్ష పెడుతున్నారు. అసలు టెలికామ్ చట్టం ఏమి చెబుతోంది? ఒక వ్యక్తి (జమ్మూకశ్మీర్,  అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు తప్పించి) ఏ రాష్ట్ర పౌరుడైనా తన పేరిట తొమ్మిది వరకు సిమ్ కార్డులు కలిగి ఉండొచ్చని నియమం ఉంది.

కొత్త టెలికామ్ చట్టం 2023 ప్రకారం నిర్ధారించిన దానికన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే బాధ్యుడిని చేస్తారు. మీరు ఆరు లేక తొమ్మిది కన్నా ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి సారి చేసే అపరాధానికి రూ. 50000 పెనాల్టీ, తర్వాత అదే తప్పు చేస్తే రూ.200000 వరకు పెనాల్టీ పెరుగుతుంది. ప్రస్తుతానికి సిమ్ కార్డులపై పరిమితి ఖచ్చితంగా ఆచరించనప్పటికీ, మోసపూరితంగా సిమ్ కార్డులు తీసుకుంటే మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమాన పడే అవకాశం ఉంది. నిర్ణీత పరిమితికి మించి మీరు సిమ్ కార్డులు కలిగి ఉంటే, లేదా మీ పేరిట వేరే వారు సిమ్ కార్డులు తీసుకున్నా మీరు భాధ్యులు కావొచ్చు. మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులున్నవి ట్రాక్ చేసుకోండి.

మీ పేరు మీద వేరే వారు సిమ్ కార్డు తీసుకుని మోసపూరిత వ్యవహారాలకు ఉపయోగిస్తే…మీకు ముప్పు రావొచ్చు. అందుకనే మీ పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయన్నది చెక్ చేసుకోండి. అందుకు మీరు ‘సంచార్ సాథీ’ అనే పోర్టల్ కు వెళ్లి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. సంచార్ సాథీ పోర్టల్ మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూపుతుంది. అందుకేమి చేయాలి?

స్టెప్ 1: https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ కు లాగిన్ అవ్వండి.

Step-1

స్టెప్2: మీ మొబైల్ నంబర్ ను నిర్ణీత కాలమ్ లో ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చాను టైప్ చేసి, ‘వ్యాలిడేట్ క్యాప్చా’ మీద క్లిక్ చేయండి. మీకో ఓటిపి వస్తుంది. ఆ ఓటిపిని నిర్ణీత కాలమ్ లో టైప్ చేయండి.

Step 2

స్టెప్ 3: ఓ కొత్త వెబ్ పేజీ తెరుచుకుని మీ పేరిట ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో చూపెడుతుంది. దానిలో మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి- అవి: ‘నాట్ మై నంబర్’, ‘నాట్ రిక్వయిర్డ్’, ‘రిక్వయిర్డ్’ అని మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు మీకు కావలసిన ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయడం తొందరపాటుతో చేయకండి. బాగా ఆలోచించి చేయండి.

Step 3

తన పేరిట తొమ్మిది కన్నా ఎక్కువ సిమ్ కార్డులున్న వారు రీ-వెరిఫికేషన్ చేసుకోవలసి ఉంటుంది. మీ మొబైల్ నంబర్ రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ అయి ఉంటే మీరు మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆ మూడు ఆప్షన్లు: సరెండర్/ ట్రాన్స్ ఫర్/ డిస్ కనెక్షన్.

నిర్ధారిత సంఖ్య కన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మీకు నోటీస్ రావొచ్చు. నోటీసు రాక ముందే మీరు మీ పరిమితిలో ఉంటే మీకు ఎలాంటి పెనాల్టీ పడదు. కానీ నోటీసు వచ్చిందో పెనాల్టీ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక తస్మాత్ జాగ్రత్త!

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News