Wednesday, January 22, 2025

ములుగు జడ్‌పి చైర్మన్ జగదీశ్ హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -
గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి
సిఎం కెసిఆర్ హూక్షుగ్భాంతి, అండగా నిలుస్తామని భరోసా
బిఆర్‌ఎస్ కుటుంబానికి తీరనిలోటు : మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ములుగు బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు. జగదీష్‌కు గుండెపోటు రావడంతో కుటుంబస భ్యులు ఆయన్ను హన్మకొండలోని అజారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థి దశలో వామపక్ష నాయకుడిగా, 1997లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జన సభ సమయంలో టిఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమకారుడిగా క్రియాశీలక పాత్రను జగదీష్ పోషించారు. ఆయన మృతిపై సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.

జగదీష్ కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ అండ: సిఎం కెసిఆర్
జగదీష్ మృతి పార్టీకి తీరనిలోటని బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సిఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీష్ క్రియాశీల పాత్ర పోషించారని సిఎం పేర్కొన్నారు. జగదీష్ కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా సేవలు అందించారు: మంత్రి కెటిఆర్
ములుగు జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సంతాపం తెలియచేశారు. జగదీష్ అకాల మరణం పట్ల కెటిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు. జగదీష్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఆయన అందించిన సేవలను మంత్రి కెటిఆర్ స్మరించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి కెసిఆర్‌తో, పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా జగదీష్ సేవలు అందించారని కెటిఆర్ అన్నారు. ఈ మధ్యే తాను ములుగు జిల్లాలో పర్యటించినప్పుడు అత్యంత చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీష్, ఆకస్మికంగా మరణించడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని కెటిఆర్ పేర్కొన్నారు. ఆయన మృతి బిఆర్‌ఎస్ పార్టీ కుటుంబానికి, జిల్లాకు తీరని లోటన్నారు. జగదీష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు.

సన్నిహితుడి మృతి బాధకు గురిచేసింది: హరీష్‌రావు
కుసుమ జగదీష్ అకాల మరణంపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్నిహతుడైన జగదీష్ మృతి తనను ఎంతో బాధకు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారన్నారు.

జగదీష్ మృతి బాధాకరం: మంత్రులు
జగదీష్ మృతి బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆదివారం జగదీశ్ పార్థివదేహాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి తదితరులు సందర్శిం చారు. ఆయన భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు వేముల, ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టిఎస్ రెడ్‌కో చైర్మన్ వై.సతీష్‌రెడ్డి, శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్‌లు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News