Thursday, January 23, 2025

ములుగులో చెల్లిపై అన్నయ్య గొడ్డలితో దాడి

- Advertisement -
- Advertisement -

ములుగు: ఆస్తి తగాదా నేపథ్యంలో చెల్లిపై అన్న గొడ్డలితో దాడి చేసిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేటలో జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. లక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదా విషయంలో గత కొద్ది రోజులుగా అన్న చెల్లెల మ‌ధ్య వివాదం కొన‌సాగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉద‌యం చెల్లె పొన్నం సారక్క పై అన్న సమ్మయ్య గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకున్న సారక్కను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు సమ్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News