- Advertisement -
వరంగల్: ములుగు జిల్లా వాజేడు మండలంలో బాంబు పేలుడు కలకలం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి చెందారు. కొంగల గ్రామానికి చెందిన ఓ ఏసు అనే వ్యక్తి వంట చెరుకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కట్టేలు కొడుతుండగా బాంబు పేలడంతో ఏసు దుర్మరణం చెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -