Thursday, December 12, 2024

ముంబై బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: పశ్చిమ కుర్లాలో జరిగిన ‘బెస్ట్’ బస్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. 42 మందికి గాయాలయ్యాయని అధికారులు మంగళవారం ధృవీకరించారు. ఈ బస్సు ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది.  బస్సు ఎస్ జి బార్వే మార్గ్ లో పాదచారులపై, వాహనాలపై దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

బస్సు అంధేరి వైపు వెళుతుండగా అదుపు తప్పింది. 100 మీటర్ల వరకు 30 నుంచి 40 వాహనాలను గుద్దేసింది. సల్మాన్ బిల్డింగ్ కు చెందిన కాంపౌండ్ గోడను కూడా ఢీకొంది. డ్రైవర్ బస్సుపై అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా డ్రైవర్ సంజయ్ మోరే ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News