Thursday, January 23, 2025

ఒకే రోజు 61 కిలోల బంగారం స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

 

ముంబై : ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ చరిత్రలో తొలిసారి ఒకే రోజు 32 కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకోగలిగారు. ఈనెల 11న ఎయిర్‌పోర్టులో 61 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ తో తరలించేందుకు చేసిన ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు విఫలం చేశారు. తనిఖీల ద్వారా 32 కోట్ల విలువైన బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురు ప్రయాణికులను అరెస్టు చేయగలిగారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇన్ని కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పెద్దమొత్తంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో సరిగ్గా స్పందించారని మెచ్చుకున్నారు.

మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడు నడుము బెల్ట్ లోపల పెట్టుకున్న ప్యాకెట్లలో రహస్యంగా దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో 28.17 కోట్ల రూపాయల విలువైన 53 కిలోల బంగారాన్ని నలుగురు ప్రయాణికుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. యూఏఈలో తయారైన ఈ బంగారు బిస్కట్లను దోహా ఎయిర్‌పోర్టులో ఓ సూడాన్ భారతీయుడు ఈ ప్రయాణికులకు ఇచ్చాడని బయటపడింది. ఇదే విధంగా దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.3.88 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకోగలిగారు. ఈ ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు బంగారం పొడిని మైనపు ముద్దగా చేసి జీన్‌ఫ్యాంటుల్లో నడుంకు చుట్టుకుని తీసుకువస్తుండగా పట్టుబడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News