Sunday, December 22, 2024

ముంబయి ఎయిర్ పోర్ట్ లో కొకైన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ముంబయి విమానాశ్రయంలో అధికారులు భారీగా కొకైన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కెన్యా రాజధాని నైరోబీనుంచి వచ్చిన ఒక మహిళ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ మహిళ ధరించిన బూట్లు, షాంపూ బాటిల్, మాయిశ్చరైజర్ బాటిల్ అడుగున తెల్లటి పౌడర్ ను దాచినట్లు వెల్లడైంది. అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News