- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఓ థాయ్‌లాండ్ మహిళా వద్ద నుంచి రూ. కోట్ల విలువ చేసే కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. కొకైన్ అక్రమ రవాణా జరుగుతుందని విషయం తెలియడంతో ముంబయి ఎయిర్ పోర్టులో ప్రతి లగేజీని సున్నితంగా అధికారులు పరిశీలించారు. తెల్లటి పొడిలాంటి పదార్థాన్ని కలిగిన ఉన్న థాయ్‌లాండ్ మహిళ బ్యాగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ పొడిని పరిశీలించగా కొకైన్‌ను అని గుర్తించారు. కొకైన్ విలువ దాదాపుగా రూ.40 కోట్లు ఉంటుందని విమానయాన సిబ్బంది వెల్లడించారు. థాయ్ మహిళపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకట్రోపికి సబ్ స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేశారు.
- Advertisement -