- Advertisement -
బరూచ్: ముంబై యాంటీ నార్కొటిక్ సెల్ యూనిట్ మంగళవారం బరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్‌లోని ఓ డ్రగ్స్ ఫ్యాక్టరీ మీద దాడులు నిర్వహించింది. దాదాపు 513 కిలోగ్రాముల ఎండీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 1026 కోట్లు ఉంటుందని అంచనా. ఒక మహిళ సహా ఏడుగురు నిందితులను ముంబై యాంటీ నార్కొటిక్ విభాగం నిర్బంధంలోకి తీసుకుంది. దీనికి ముందు జూన్ నెలలో సముద్రతీరంలోని కచ్ జిల్లాలో కోట్లాది రూపాయల డ్రగ్స్ కూడా గుజరాత్‌లోనే పట్టుబడింది.
- Advertisement -