ముంబై : అనారోగ్యం వల్ల లేదా భౌతికంగా బలహీనమై మంచం పట్టిన వారికి ఇంటి వద్దే కరోనా టీకాలు ఇచ్చే ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) చేపట్టనుంది. ఈ ప్రక్రియను మొదట కెఈస్ట్ వార్డ్ నుంచి ప్రారంభిస్తారు. అంథేరీ తూర్పు, మరోల్, చకల, తదితర పశ్చిమ సబర్బన్ ప్రాంతాలు ఈ వార్డు పరిధి లోకి వస్తాయి. వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో కొవాగ్జిన్ టీకా డోసులు ఈ ప్రాంతాల ప్రజలకు అందిస్తారు. వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వారి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని, దీనికి చాలా డిమాండ్ ఉంటోందని బిఎంసి వర్గాలు పేర్కొన్నాయి. కె.ఈస్ట్ వార్డులో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత వచ్చే దశలో ఏవేవీ అంశాలు ఇందులో చేర్చాలో అధ్యయనం చేయడమౌతుందని బిఎంసి పేర్కొంది. ఎవరైతే మంచం పట్టి ఉన్నారో వారి సమాచారాన్ని తమకు ఇ మెయిల్ ద్వారా తెలియచేయాలని బిఎంసి ప్రకటించింది.
ముంబైలో రేపటి నుంచి హోమ్ వ్యాక్సినేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -