Monday, December 23, 2024

ముంబై బిల్డర్ 23 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mumbai builder commits suicide by jumping from 23rd floor

ముంబై : ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్ పారస్ పోర్‌వాల్ 23 వ అంతస్తు లోని తన హోమ్‌జిమ్ పైనుంచి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై చించ్‌పోకి రైల్వే స్టేషన్ సమీపం లోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీ బిల్డింగ్‌లో ఆయన ఉంటున్నారు. జిమ్ బాల్కనీ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కిందకు దూకినట్టు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల పారస్ రాసిన ఓ సూసైడ్ నోట్‌ను జిమ్‌లో పోలీసులు కనుగొన్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, ఎవరిపైనా దర్యాప్తు చేయవద్దని ఆ నోట్‌లో ఆయన పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు. పారస్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఒక గార్డు చూసి , వెంటనే కుటుంబ సభ్యులకు , స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పారస్ ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఆర్థికంగా నష్టపోవడం వంటి వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News