Monday, December 23, 2024

సుప్రీంకోర్టు జడ్జిగా ముంబై సిజెఐ దీపాంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాకు పదోన్నతి దక్కింది. ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. రాజ్యాంగం మేరకు సంక్రమించిన అధికారాల పరిధిలో జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూ తమ ట్విట్టర్‌లో తెలిపారు.

కొలీజియం స్థాయిలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ప్రక్రియపై కేంద్రం, అత్యున్నత న్యాయస్ధానం మధ్య తీవ్రస్థాయి వివాదాలు సాగుతున్న దశలోనే దీపాంకర్ దత్తాకు సుప్రీంకోర్టుకు పదోన్నతి సంబంధిత అధికారిక ప్రకటన వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News