Sunday, January 19, 2025

ఎంపి ఎమ్మెల్యే దంపతులకు బెయిల్

- Advertisement -
- Advertisement -

Mumbai court Bail for MP MLA couple

మీడియాతో మాటలొద్దు.. చాలీసాకు దిగొద్దు

ముంబై : హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టు అయిన మహారాష్ట్ర ఎంపి ఎమ్మెల్యే దంపతులు రవి రాణా, నవనీత్ రాణాలకు బుధవారం ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సిఎం ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట వీరు హనుమాన్ చాలీసాకు దిగుతామని తెలియచేయడం ద్వారా శాంతిభద్రతల క్షీణతకు యత్నించారని అభియోగాలు వెలువడ్డాయి. దీనితో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిరివురు ఇటువంటి నేరానికి పాల్పడరాదని బెయిల్‌లో ఉన్నప్పుడు కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదని న్యాయస్థానం షరతులు పెట్టింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన రవి ఆయన భార్య నవనీత్ రాణాలను ఎప్రిల్ 2వ తేదీన అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News