Wednesday, January 22, 2025

ప్రజ్ఞా ఠాకూర్‌కు కోర్టు మందలింపు

- Advertisement -
- Advertisement -

ముంబై: మాలెగావ్ బాంబు పేలుడు కేసులో విచారణకు పదే పదే గైర్హాజరవుతున్నందుకు నెలరోజుల క్రితం బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొన్న బిజెపి ఎంపి ప్రజ్ఞా ఠాకూర్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం తీవ్రంగా మందలించింది. 2008లో జరిగిన మాలెగావ్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితురాలైన ప్రజ్ఞా ఠాకూర్ బుధవారం నాటి విచారణకు సైతం హాజరుకాలేదు. ఆమె వరుస గైర్హాజరీ విచారణకు అవరోధం కలిగిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) కోర్టుకు తెలిపింది.

విచారణకు హాజరుకాకపోవడానికి ఆరోగ్య కారణాలను ఆమె చూపుతోందని ఎన్‌ఐఎ తెలియచేయగా ఆమో ఆరోగ్య పరిస్థితిపై వచ్చే సోమవారం(ఏప్రిల్ 8) స్థాయీ నివేదికను సమర్పించాలని ఎన్‌ఐఎని కోర్టు ఆదేశించింది. ఆరోగ్య కారణాలపై ఈ కేసులో బెయిల్ పొందిన భోపాల ఎంపి ప్రజ్ఞా ఠాకూర్ క్రికెట్, బాస్కట్‌బాల్ ఆడుతూ, డ్యాన్సు చేస్తూ పలుసార్లు కనిపించారు. గతంలో కూడా ఆసుపత్రిలో చేరి కోర్టుకు గైర్హాజరైన ఆమె అదే రోజు సాయంత్రం ఒక బహిరంగ సభకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News