Monday, April 28, 2025

ముంబయి ఇడి భవనంలో ఘోర అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

దక్షిణ ముంబయిలో ఆదివారం తెల్లవారు జామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయ భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని, అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు. బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని కైజర్ ఇ హింద్ భవనంలో ఆదివారం తెల్లవారు జామును సుమారు 2.31 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఇడి కార్యాలయం ఉన్న ఐదు అంతస్తుల భవనంలోని నాలుగవ అంతస్తులో మొదలైన మంటలు గంటలపాలు ప్రజ్వరిల్లాయని, వాటిని చివరకు అదుపు చేశారని అధికారులు వివరించారు. షార్ట్ సర్కూట్ వల్ల మంటలు లేచాయని, ఫర్నిచర్,

కప్‌బోర్డులు, విద్యుత్ సాధనాలు ధ్వంసం అయ్యాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. పోలీస్ బృందాలు ఆ ప్రదేశంలో ఉన్నట్లు, పంచనామా నిర్వహిస్తున్నట్లు, మరింత దర్యాప్తు సాగుతున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా, తెల్లవారు జామున సుమారు 4.17 గంటలకు ముంబయి ఫైర్ బ్రిగేడ్ అగ్ని ప్రమాదాన్ని లెవెల్ 3కి పెంచింది. దానిని ఘోర అగ్ని ప్రమాదంగా పరిగణిస్తారు. మంటల నియంత్రణకు ఎనిమిది ఫైరింజన్లు, ఆరు జెట్టీలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర పరికరాలను నియోగించినట్లు ఫైర్ బ్రిగేడ్ అధికారి ఒకరు తెలిపారు. కార్యాలయం లోపల పలు పత్రాలు, పరికరాలు ధ్వంసమైనట్లుగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News