Friday, February 21, 2025

కష్టాల్లో ముంబై

- Advertisement -
- Advertisement -

విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై టీమ్ కష్టాల్లో చిక్కుకుంది. 406 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై గురువారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ముంబై మరో 323 పరుగులు చేయాలి. అయితే ఇప్పటికే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో ముంబైకి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఓపెనర్ ఆయూష్ మాత్రె (18) పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సిద్దేశ్ లడ్ (2) కూడా నిరాశ పరిచాడు.

జట్టును ఆదుకుంటాడని భావింన కెప్టెన్ అజింక్య రహానె కూడా విఫలమయ్యాడు. రహానె 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (27), శివమ్ దూబె (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. యశ్ రాథోడ్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ రాథోడ్ 11 ఫోర్లతో 151 పరుగులు చేశాడు. మిగతా వారిలో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (52) మాత్రమే రాణించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో విదర్భ ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేక పోయింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములాని ఆరు, తనూష్ కొటియాన్ మూడు వికెట్లు పడగొట్టారు.

గుజరాత్ 429/7
కేరళతో జరుగుతున్న మరో సెమీ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన గుజరాత్ గురువారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈ స్కోరు సాధించింది. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే గుజరాత్ మరో 28 పరుగులు చేయాలి. కాగా, గుజరాత్ టీమ్‌లో ప్రియాంక్ పాంచల్, జేమిత్ పటేల్ మాత్రమే రాణించారు. ఓపెనర్ ప్రియాంక్ 237 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 148 పరుగులు చేశాడు. పటేల్ 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కేరళ బౌలర్లలో జలజ్ సక్సెనా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News