ఐపిఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీకొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత సొంత గ్రౌండ్‌లో అదరిపోయే విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన పోరులో ఏకపక్షం చెలాయించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ 26 (16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్), రమణ్‌దీప్ సింగ్ 22 (12 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ (2/19) రెండు వికెట్లు పడగొట్టాడు.
ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విజ్ఞేష, విచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. అనంరతం లక్ష ఛేదనకు దిగిన మంబై 12.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునయాస విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ(12), విల్ జాక్స్(16) విఫలమైనా.. ర్యాన్ రికెల్టన్ 62 నాటౌట్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో), సూర్యకుమార్ యాదవ్ 27 నాటౌట్ (9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో) విజయలాంఛనాన్ని పూర్తిచేశారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీరస్సెల్ రెండు వికెట్లు దక్కాయి. ఈ భారీ విజయం ముంబై ఇండియన్స్ నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలోకి దూసుకెళ్లింది.