Monday, December 23, 2024

సన్‌రైజర్స్‌కు ముంబై షాక్

- Advertisement -
- Advertisement -

వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించింది. అద్భుత ఆటతో అలరించిన ముంబై ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48), కెప్టెన్ కమిన్స్ 35 (నాటౌట్) మాత్రమే రాణించారు.

ఆతిథ్య టీమ్ బౌలర్లలో హార్దిక్, చావ్లా మూడేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 17.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 12 ఫోర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తిలక్‌వర్మ 37 (నాటౌట్) అండగా ఉన్నాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News