Saturday, April 19, 2025

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పై ముంబై ఇండియన్స్ విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ సీజన్ 2025లో ముంబై ఇండియన్స్ మూడో విజయం సాధించింది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో ముంబై నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముంబైకి ఇది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ ఏడు ఫోర్లతో 40, ట్రావిస్ హెడ్ 3 ఫోర్లతో 28 పరుగులు చేశారు. వీరు తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్ (2) మరోసారి నిరాశ పరిచాడు.

క్లాసెన్ 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. అనికేత్ వర్మ రెండు సిక్స్‌లతో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నితీశ్ రెడ్డి (19) పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) పరుగులు చేశారు. విల్ జాక్స్ (36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 21 (నాటౌట్), సూర్యకుమార్ (26), హార్దిక్ పాండ్య (21) తమవంతు పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News