- Advertisement -
ఐపిఎల్‌లోముంబై ఇండియన్స్ వరుస విజయాల పరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైకి ఈ సీజన్‌లో ఇది ఐదో విజయం కావడం విశేషం. మరోవైపు హైదరాబాద్ ఆరో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ (43) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (70), సూర్యకుమార్ యాదవ్ 40 (నాటౌట్) జట్టును గెలిపించారు.
- Advertisement -