Monday, December 23, 2024

రికార్డు సృష్టించిన ముంబయి ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: ముంబయి ఇండియన్స్ జట్టు 150 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. టి20 ఫార్మాట్‌లో ఏ జట్టు అన్ని విజయాలు సాధించలేదు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు 148 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించడంతో ఈ రికార్డు సృష్టించింది. ఐపిఎల్‌తో పాటు ఛాంపియన్స లీగ్ టి20లో టోర్నీలలో 273 మ్యాచ్‌లు ముంబయి ఇండియన్స్ ఆడింది. ఇందులో 150 మ్యాచ్‌లలో విజయం సాధించగా 177 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. రెండు మ్యాచ్‌లకు ఫలితాలు దక్కలేదు. సూపర్ ఓవర్‌లో రెండు మ్యాచ్‌లు గెలచగా మరో రెండింట్లో ఓడిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 148 విజయాలతో రెండో స్థానంలో ఉంది. సిఎస్‌కె 253 మ్యాచ్‌లలో 148 విజయం సాధించగా 101 మ్యాచ్‌లలో ఓటమిని చవి చూసింది. రెండు మ్యాచుల్లో ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్‌లో చెన్నై జ‌ట్టు రెండు మ్యాచ్‌లలో ఓడిపోగా రెగ్యుల‌ర్ మ్యాచ్ టై చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News