Thursday, January 23, 2025

రాత మారని ముంబై

- Advertisement -
- Advertisement -

రోహిత్ సేనకు ఐదో ఓటమి

Mumbai Indians defeat in 5th Time

పుణె: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 12 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52), శిఖర్ ధావన్ (70) జట్టుకు శుభారంభం అందించారు. చివర్లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ 30 (నాటౌట్), షారూఖ్ ఖాన్ (15) ధాటిగా ఆడారు. దీంతో పంజాబ్ భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు, మూడు బౌండరీలతో వేగంగా 28 పరుగులు చేశాడు. మరోవైపు డేవిడ్ బ్రేవిస్ కూడా విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన బ్రేవిస్ 25 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 49 పరుగులు చేశాడు. తిలక్ వర్మ (36), సూర్యకుమార్ (43) కూడా రాణించినా ముంబైకి ఓటమి మాత్రం తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News