Monday, December 23, 2024

తీరు మారని ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

రోహిత్ కెప్టెన్సీకి ఎసరు తప్పదా?

srh vs mi match highlights
ముంబై: ఐపిఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఓ పీడకలగా మిగిలిపోయింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ముంబై ఇండియన్స్ మూటగట్టుకొంది. వరుసగా ఎనిమిది మ్యాచుల్లో ఓడి ఐపిఎల్‌లోనే ఎక్కువ పోటీల్లో పరాజయం పాలైన చెత్త రికార్డును రోహిత్ సేన సొంతం చేసుకుంది. సీజన్ ఆరంభానికి ముందు ముంబై టోర్నీలో ఫేవరెట్ టీమ్. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, బ్రెవిస్, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్లు ముంబై టీమ్‌లో ఉన్నారు. ఐపిఎల్ మెగా వేలం పాటలో ఇషాన్ కిషన్‌ను 15 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి ముంబై సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇషాన్ మాత్రం తనపై జట్టు యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నీరుగార్చాడు.

ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప అతను రాణించిందేమీ లేదు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ఆటను కబనరచలేక తేలిపోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటింగ్‌లో అటు కెప్టెన్సీలో రోహిత్ పూర్తిగా నిరాశ పరిచాడు. జట్టును ముందుండి నడిపించడంలో రోహిత్ ఘోర వైఫల్యం చెందాడు. రోహిత్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. కెప్టెన్సీ కూడా గాడితప్పింది. అతను తీసుకుంటున్న నిర్ణయాలన్ని బెడిసి కొడుతున్నాయి. ప్రత్యర్థి జట్ల సారథులు తమ జట్లను ముందుండి నడిపిస్తుండగా రోహిత్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి పోయాడు.

బ్యాట్‌తో జట్టుకు అండగా నిలువలేక పోతున్నాడు. బ్రెవిస్ అడపాదడపా రాణిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సూర్యకుమార్, బ్రెవిస్‌లు మాత్రమే ఈ సీజన్‌లో కాస్త మెరుగైన ఆటను కనబరిచారు. ఇక సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పూర్తిగా తేలిపోతున్నాడు. బ్యాట్‌తో బంతితో జట్టును ఆదుకోవడంలో విఫలమవుతున్నాడు. పొలార్డ్ వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. బుమ్రా కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. గతంతో పోల్చితే ముంబై బౌలింగ్ చాలా బలహీనంగా మారిందనే చెప్పాలి. అప్పట్లో బౌల్ట్, రాహుల్ చాహర్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు ఉండేవారు. అంతేగాక కృనాల్, హార్దిక్ వంటి ఆల్‌రౌండర్లు లేని లోటు కూడా ముంబై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ వైఫల్యం ముంబై వరుస ఓటములకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News