- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ కష్టాల్లో కూరుకుపోయింది.ఒక దశలో పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 35 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయిన ముంబై బౌలర్లను ఎదుర్కొంటూ హెన్రిచ్ క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (71; 44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్ లు) అభినవ్ (43;37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లు) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో దీపక్ 2,ట్రెంట్ 4, హార్ధిక్ పాండ్యా, బుమ్రా తలో వికెట్ తీశారు.
- Advertisement -