- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు తీసింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు మిచెల్ మార్ష్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన లక్నో జట్టుకు మార్ష్ శుభారంభాన్ని అందించాడు.మిచెల్ మార్ష్ 27 బంతుల్లోనే అర్థశతకాన్ని సాధించాడు. అయితే విఘ్నేశ్ పుత్తూర్ వేసిన 7వ ఓవర్ చివరి బంతికి మార్ష్(60), విఘ్నేశ్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మార్కమ్ (53), బదోని(30) డేవిడ్ మిల్లర్ (27) పరుగులు తీశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్య ఐదు వికెట్లను పడగొట్టాడు.
- Advertisement -