Thursday, January 23, 2025

గుజరాత్‌కు ముంబై షాక్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. తొలుత బ్యాటింగగ్ చేసిన 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ తన జోరును కొనసాగించాడు.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 49 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 11 బౌండరీలతో అజేయంగా 103 పుగులు చేశాడు. దీంతో ముంబై భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 32 బంతుల్లోనే 10 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 79 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News