Monday, December 23, 2024

ముంబైకి కీలకం.. నేడు గుజరాత్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌కి కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయ ఎదురైంది. మరోవైపు గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగింటిలో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ముంబై ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు జట్టుకు కీలకంగా మారారు. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్‌లు జోరుమీదున్నారు. తిలక్ వర్మ కూడా బాగానే ఆడుతున్నాడు. దీంతో ముంబై ఈ మ్యాచ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. గుజరాత్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సొంత గడ్డపై ఆడుతుండడం హార్దిక్ సేనకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News