- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఇది ముంబైకి వరుసగా ఐదో విజయం.తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరగులు చేసింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 161 పరుగలకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (34;24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) , ఆయూష్ బదోని(35; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు), నికోలస్ పూరన్ ( 27 ; 15 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్స్ లు)దూకుడుగా ఆడిన విజయం సాధించలేకపోయారు. ముంబై బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా 4, ట్రెంట్ బౌల్ట్ 3, విల్ జాక్స్ 2, కోర్బిన్ బాష్ 1 వికెట్ పడగొట్టారు.
- Advertisement -