Monday, December 23, 2024

సిఎస్‌కెకు ముంబై షాక్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇం డియన్స్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె)ను చిత్తు చేసింది. ముంబై విజయంతో సిఎస్‌కె ప్లేఆఫ్ అవకాశాలకు తెరపడింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది మూడో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 16 ఓవర్లలో కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 14.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ముంబై తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిం ది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (6) మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 4 ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చి న(1) కూడా విఫలమయ్యాడు. ఆ వెంటటనే ట్రిస్టన్ స్టుబ్స్ (0) కూడా ఔట్ కావడంతో ముంబై 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశ లో తెలుగుతేజం తిలక్ వర్మ 34 (నాటౌట్), హృతిక్ షోకిన్ (18) జట్టును ఆదుకున్నారు. చివరల్లో టిమ్ డేవిడ్ రెండు సిక్సర్లతో అజేయంగా 16 పరుగులు చేయడంతో ముంబై విజయం అందుకుంది. అంతకుముందు తొలు త బ్యాటింగ్ చేసిన సిఎస్‌కెను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. డానిల్ షమ్స్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, కుమార్ తదితరులు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి సిఎస్‌కె బ్యాటర్లను ఒత్తిడికి గురయ్యారు. ఇక ముంబై బౌలర్ల ధాటికి తట్టుకోలేక చెన్నై 97 పరుగులకే కుప్పకూలిం ది. ఆ జట్టులో కెప్టెన్ ధోనీ 36(నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News