Thursday, January 23, 2025

పంజాబ్‌పై ముంబై ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

ముల్లాన్‌పుర్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 36 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన తిలక్ వర్మ 18 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఆదుకున్నారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పంజాబ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశారు. ధాటిగా ఆడిన శశాంక్ 25 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన అశుతోస్ 7 సిక్సర్లు, రెండు ఫోర్లతో 61 పరుగులు సాధించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, కొయెట్జి మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News