Wednesday, January 22, 2025

ఐపిఎల్ 2024: బోణీ కొట్టిన ముంబయి ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీతో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచులో ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో గెలిచింది.. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల కోల్పోయి 234 పరుగుల టార్గెట్ ఇచ్చింది. రన్ చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ముంబయి బ్యాంటింగ్ లో రోహిత్ శర్మ(49), డేవిడ్ (450), ఇషాన్(42), షెఫర్డ్(39) నాటౌట్, హర్దిక్(39) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో అక్షర్, నోర్జేకు చెరో రెండు వికెట్లు దక్కాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచులో ఢిల్లీ బ్యాటింగ్ లో స్టబ్స్ (71), (పృథ్వీ షా 66), అభిషేక్ పారెల్ (41) పరుగులు చేశారు. ముంబయి బౌలింగ్ లో కొయెట్జీ అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు తీయగా, బూమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News