- Advertisement -
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైంది. ఇప్పటివరకూ ఇరు జట్లు ఆడిన మూడు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మకి మోకాలికి గాయం కావడంతో అతని స్థానంలో విల్ జాక్స్ ముంబై జట్టుకి ఓపెనింగ్ చేస్తాడు. ఇక లక్నో జట్టులో ఎం.సిద్ధార్త్ స్థానంలో ఆకాశ్‌దీప్ జట్టులోకి వచ్చాడు.
- Advertisement -