- Advertisement -
ముంబై: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా రావడంతో ఆ జట్టుకు మరింత బలం చేకూరింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ముంబై లక్ష్యంగా పెట్టుకుంది. బుమ్రాతో పాటు.. రోహిత్ శర్మ కూడా ముంబై జట్టులోకి వచ్చాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే జట్టుతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.
- Advertisement -