- Advertisement -
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇక గత ఏడాది స్లో ఓవర్ రేటు కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదురుకుంటున్న హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.
- Advertisement -