Monday, December 16, 2024

రహానె మెరుపులు

- Advertisement -
- Advertisement -

సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్‌లో ముంబై ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ముంబై ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ శశావత్ రావత్ (33), కెప్టెన్ కృనాల్ పాండ్య (30) పరుగులు చేశారు. ధాటిగా ఆడిన శివలిక్ పానియా 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో షేత్ వేగంగా 22 పరుగులు సాధించాడు. దీంతో బరోడా స్కోరు 158 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబైను ఓపెనర్ అజింక్య రహానె ఆదుకున్నాడు. ఆరంభం నుంచే రహానె చెలరేగి ఆడాడు. బరోడా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రహానె 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 98 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 30 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. దీంతో ముంబై అలవోక విజయంతో తుదిపోరుకు అర్హత సాధించింది.

టైటిల్ పోరుకు మధ్యప్రదేశ్
మరో సెమీ ఫైనల్లో మధ్యప్రదేశ్ జయకేతనం ఎగుర వేసింది. ఢిల్లీతో జరిగిన పోరులో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ముంబైతో ఎంపి తలపడుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య (29) పరుగులు చేశాడు. కెప్టెన్ బడోని (19), ఓపెనర్ యశ్ ధూల్ (11), హిమ్మత్ సింగ్ (15) పరుగులు సాధించారు. వికెట్ కీపర్ అనూజ్ రావత్ అజేయంగా (33) పరుగులు చేశాడు. మయాంక్ రావత్ (24) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ 15.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది. ఓపెనర్ హర్ష్ (30) పరుగులు చేశాడు. హర్‌ప్రీత్ సింగ్ అజేయంగా 46 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటిదార్ 29 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News