ముంబయి: రైల్ ఇంజన్ డ్రైవర్లు సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం పట్టాలు దాటుతున్న ఒక వృద్ధుని ప్రాణాలను కాపాడింది. ఆదివారం కల్యాణ్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ముంబయి నుంచి వారణాసి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో థాణె జిల్లాలోని కల్యాణ్ రైల్వే స్టేషన్‌ను దాటింది. అదే సమయంలో రైలు పట్టాలు దాటుతున్న హరి శంకర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదుపు తప్పి ట్రాక్ మీద పడిపోయాడు. రైలు అప్పటికే అతడిని సమీపించడంతో అతను రైలు ఇంజన్ కిందకు వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న చీఫ్ పర్మనెంట్ వే ఇన్స్‌పెక్టర్(సిపిడబ్లు) సంతోష్ కుమార్ రైలు కింద పడ్డ వ్యక్తి గురించి లోకో పైలట్లు ఎస్‌కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జి రవి శంకర్‌లకు వినపడేలా బిగ్గరగా కేకలు వేశాడు. వెంటనే వారు అప్రమత్తమై ఎమర్జెనీ బ్రేకులు వేసి రైలును ఆపేశారు. వెంటనే కిందకు దిగి ఇంజన్ కిందకు వెళ్లిపోయిన ఆ వ్యక్తిని బయటకు లాగారు. ఆ వృద్ధుడు సురక్షితంగా ఉన్నట్లు సెంట్రల్ రైల్వే ఒక ప్రకటలో తెలిపింది. సరైన సమయంలో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఇద్దరు లోకో పైలట్లు, సిపిడబ్లుకు రూ. 2 వేల చొప్పున నగదు బహుమతిని అందచేయనున్నట్లు సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ప్రకటించారు.
Trespassing railway tracks is illegal and dangerous. It can be fatal.
Alert LP S.K. Pradhan & ALP Ravi Shankar of Mumbai-Varanasi Spl train 02193 applied emergency brakes at Kalyan & saved a senior citizen who was crossing tracks. Santosh Kumar, CPWI shouted to caution them (1/2) pic.twitter.com/emonSxAHzc— Central Railway (@Central_Railway) July 18, 2021
Mumbai loco pilot saves Old Man