Wednesday, January 22, 2025

భర్తను చంపి.. ఏడంతస్తుల పైనుంచి తోసి..

- Advertisement -
- Advertisement -

Mumbai Man Killed, Then Body Thrown From 7th Floor

ముంబైలో భార్య, కుమారుడి అరెస్టు

ముంబై: ఒక 54 ఏళ్ల వక్తిని అతని భార్య, కుమారుడే హత్య చేసి శవాన్ని ఏడంతస్తుల భవనం పైనుంచి కిందకు పడేశారని పోలీసులు తెలిపారు. ముంబైలోని అంబోలి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఇటీవల మరణించిన శాంతనుకృష్ణ శేషాద్రి ఆత్మహత్య చేసుకున్నాడని, గతంలో కూడా అతను ఆత్మహత్యాయత్నం చేశాడని అతని భార్య, కుమారుడు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసుల దర్యాప్తులో వాళ్లిద్దరూ అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. వాళ్లిద్దరూ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. కుటుంబ వివాదాలే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు డిఎస్‌పి మంజునాథ్ షింగే తెలిపారు. హతుడు శేషాద్రి భార్య, కుమారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News