Sunday, December 22, 2024

గొంతులో దిగిన కత్తితో బైక్‌పై ఆసుపత్రికి.. .

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మహారాష్ట్రలోని నవీ ముంబైలో మంగళవారం సొంత తమ్ముడే కత్తితో పొడవడంతో అతని అన్న, 32 ఏళ్ల వ్యాపారి గొంతులో దిగిన కత్తితో మోటారు సైకిల్ నడుపుకుంటూ ఆసుపత్రి చేరుకోగా డాక్టర్లు అతడిని కాపాడారు. గొంతులో దిగిన కత్తి సిరలు, ధమనులను చీల్చకపోవడంతో తేజస్ పాటిల్ బతికిపోయాడని, లేకపోతే అతని ప్రాణాలు దక్కేవి కావని వైద్యులు తెలిపారు.

జూన్ 3వ తేదీన సాన్‌పాడాలోని సెక్టార్ 5లోగల తన ఇంట్లో తేజస్ నిద్రిస్తుండగా అతని తమ్ముడు 30 ఏళ్ల మోనీష్ కత్తితో దాడి చేశాడు. అన్న గొంతుపై కత్తితో పొడిచి మోనీష్ పారిపోయాడు. రక్తం ధారగా కారుతుండగా నొప్పితోనే తేజస్ తన మోటారు సైకిల్ నడుపుతూ కిలో మీటరు దూరంలో ఉన్న ఆసుపత్రికి చేరుకున్నాడు. గొంతును చీల్చుకుంటూ లోపలకు వెళ్లిన కత్తిని తొలగించడానికి వైద్యులు తేజస్‌కు సర్జరీ చేశారు. దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేశారు.

తేజస్‌పై కత్తితో దాడి చేసిన మోనీష్‌తోపాటు అతని పక్కనే ఉన్న అతని స్నేహితుడిపై కూడా పోలీసులు ఐపిసిలోని సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News