Monday, December 23, 2024

పోలీసుల అదుపులో నటి రాఖీసావంత్..

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి రాఖీసావంత్‌ను ముంబై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మోడల్ యాక్టర్ షెర్లిన్ చోప్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సావంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన వ్యక్తిగత వీడియోలు ఫోటోలను సేకరించి రాఖీ సోషల్ మీడియాలో పెడుతూ తనను మానసికంగా వేధిస్తోందని షెర్లిన్ తమ ఫిర్యాదులో వెల్లడించింది.

తొలుత రాఖీ సావంత్‌ను స్థానిక అంబోలీ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి, తరువాత అంధేరీ కోర్టుకు తరలించారు. రాఖీ సావంత్‌పై ఐపిసి 354 ఎ, 509 సెక్షన్ల పరిధిలో కేసులు పెట్టారు. యాంటిసిపేటరీ బెయిల్‌కు రాఖీ సావంత్ పెట్టుకున్న దరఖాస్తును ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తిరస్కరించింది. దీనితో గురువారం ఆమె అరెస్టు తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News