- Advertisement -
ముంబై: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్వీర్కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై రణ్వీర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణకు ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు.
- Advertisement -