Tuesday, January 21, 2025

రాణా దంపతుల బెయిల్ రద్దు కోరుతూ కోర్టుకు వెళ్లిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Rana Couple

ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం వివాదం నేపథ్యంలో దేశద్రోహం సహా ఆరోపణలపై అరెస్టయిన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ముంబై పోలీసులు సోమవారం నగరంలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ వారి బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరారు. ప్రత్యేక కోర్టు బుధవారం ఇద్దరికీ బెయిల్‌ను అనుమతించి, ఒక్కొక్కరికి రూ.50,000 బాండ్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ష్యూరిటీ వచ్చే వరకు రెండు వారాల పాటు ప్రొవిజనల్ క్యాష్ బెయిల్‌పై విడుదల చేయాలని వారి న్యాయవాదులు కోరారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ ద్వారా ఖర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేసు విషయాలు మీడియాతో మాట్లాడటం ద్వారా రాణా దంపతులు ఆంక్షలను ఉల్లంఘించారని, షరతులను ఉల్లంఘించినట్లయితే బెయిల్ రద్దు అవుతుందని ఉత్తర్వు స్పష్టంగా పేర్కొందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News