Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు అయింది. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌పై ఐపిసి సెక్షన్ 153 ఎ 1(ఎ) కింద కేసులు నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. జనవరి 29న ముంబయిలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసినందుకు బిజెపి నుంచి సస్పెండ్ అయిన ఎంఎల్‌ఎ రాజా సింగ్‌పై గ్రేటర్ ముంబయి పోలీసులు దాదర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతిని కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్‌లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళలను దుర్వినియోగం చేయడం, వారి భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మార్చ్‌కు పోలీసులు అనుమతించారు, నిర్వహకులు ర్యాలీ కూడా నిర్వహించారని, అందులో ఎంఎల్‌ఎ రాజాసింగ్ రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని, ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పేర్కొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న ఇతర బిజెపి నాయకులు ఈ విధంగా మాట్లాడకపోయినా, రాజా సింగ్ దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో ’లవ్-జిహాద్’ గురించి మాట్లాడారు. ‘హిందూ సమాజం అంతా కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన సోదరీమణులు, కుమార్తెలు ఈ వ్యవస్థీకృత పథకాలకు బలి అవుతున్నారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని నేను ప్రతి హిందు వును కోరుతున్నాను అని రాజాసింగ్ అన్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు.

దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసులో రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News