Monday, November 18, 2024

మెఫెడ్రోన్ తయారీ రాకెట్ గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లాలో మెఫెడ్రోన్ తయారీ రాకెట్‌ను ముంబై పోలీస్‌లు ఛేదించగలిగారు. సాంగ్లీ జిల్లా ద్రాక్షతోట పరిసరాల్లో మెఫెడ్రోన్ తయారీ కర్మాగారాన్ని కనుగొని రూ. 245 కోట్ల విలువైన క్వింటా మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం పోలీస్ అధికారి వెల్లడించారు. గత నెలలో ముంబైలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీస్‌లు పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో ఈ తయారీ గుట్టు బయటపడింది. మెఫిడ్రాన్ తయారు చేసే ప్రవీణ్ షిండేతోపాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారి 34 ఏళ్ల షిండే. డాక్టర్‌గా ఆయన తన వారిలో చెలామణీ అవుతున్నాడు. సాంగ్లీ జిల్లా లోని టాస్‌గావ్‌కు చెందిన షిండే ముంబై శివారు మీరా రోడ్‌లో పెరిగాడు.

పదవ తరగతి వరకే చదువుకున్నప్పటికీ, డ్రగ్ తయారీలో సిద్ధహస్తుడు. ఇరాలీ గ్రామంలో ల్యాబ్ పెట్టేముందు మెఫెడ్రోన్ తయారీలో శిక్షణ కోసం ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లాడు. సోమవారం అరెస్టయిన ఆరుగురిలో ఐదుగురు రైతులూ సాంగ్లీకి చెందిన వారు. ద్రాక్ష తోటల మధ్య 12 ఎకరాలు కొనుగోలు చేసి ఈ మత్తు పదార్ధాన్ని తయారు చేస్తున్నారు. తాను తయారు చేసే డ్రగ్‌కు కిలోకు రూన. 1 లక్ష వంతున షిండే సంపాదిస్తున్నాడు. ఇరాలి గ్రామంలో ఓ పొలంలో దాడులు నిర్వహించి 122.5 కిలోల మెఫెడ్రోన్‌ను , ఇతర పదార్ధాలను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌తో ప్రమేయం ఉన్న మరికొందరి కోసం పోలీస్‌లు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News