Monday, January 27, 2025

సైఫ్‌పై దాడి కేసులో ఒకరి కన్నా ఎక్కువ మంది పాత్ర

- Advertisement -
- Advertisement -

సైఫ్ అలీ ఖాన్‌కు కత్తిపోట్ల కేసులో ఒకరి కన్నా ఎక్కువ మందికి ప్రమేయం ఉండి ఉండవచ్చునని ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారని, ఈ కేసుల 30 ఏళ్ల బంగ్లాదేశీ జాతీయుని అరెస్టు చేశారని అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందన్న పోలీసుల అనుమానమే అరెస్టయిన నిందితుని కస్టడీని రిమాండ్ దరఖాస్తులో కోరడానికి ఒక కారణమని ఆ అధికారి వివరించారు. అయితే, ఇంకా వివరించడానికి ఆయన నిరాకరించారు.

సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ఈ నెల 16న బాంద్రాలోని నటుని నివాసంలో కత్తిపోటు సంఘటన సమయంలో ఉన్న ఆయన సిబ్బంది రక్తం నమూనాలు, దుస్తులను పోలీసులు సేకరించారని, వాటిని పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారని ఆయన తెలియజేశారు. సైఫ్‌పై దాడికి గాను బంగ్లాదేశీ జాతీయుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ మొహమ్మద్ రొహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయ్ దాస్‌ను పొరుగున ఉన్న ఠాణె నగరంలో పోలీసులు ఈ నెల 19న అరెస్టు చేశారు, ఫరీఫుల్ పోలీస్ కస్టడీని ఒక కోర్టు ఈ నెల 29 వరకు పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News