Wednesday, January 8, 2025

గన్నీ బ్యాగులో మహిళ మృతదేహం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహిళా మృతదేహాం గన్నీ బ్యాగ్‌లో కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని తెలగామ్ దబహేడ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ వేపై శిర్గాన్ ఫాటా గ్రామంలో పరిశుద్ధ కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తుండగా చెట్ల పొదల్లో నుంచి వాసన రావడం దగ్గరికి వెళ్లి చూశారు. రక్తపు మరకలతో గన్నీ బ్యాగులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు బ్యాగుల్లో ఓపెన్ చేసి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహం నుంచి వాసన రావడంతో రెండు రోజుల క్రితం చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి వయసు 30 నుంచి 35 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News