Friday, November 22, 2024

ముంబై రేవ్ పార్టీ కేసు: మరో నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Mumbai rave party case: Four more arrested

 

ముంబై : ఇటీవల సంచలనాత్మకంగా మారిన ముంబై రేవ్ పార్టీ కేసులో ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్టు కాగా, మరో నలుగురు మంగళవారం సాయంత్రం అరెస్టు అయ్యారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన మొత్తం ఆర్టిస్టుల సంఖ్య 16 కు పెరిగింది. మంగళవారం సాయంత్రం అరెస్టయిన నలుగురూ క్రూయిజ్‌షిప్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన ఈవెంట్ కంపెనీకి సంబంధించిన వారేనని అధికారులు తెలిపారు.

ఇప్పుడు అరెస్టయిన వారిలో అబ్దుల్ ఖదీర్ షేక్, శ్రేయాస్ నాయిర్, మనీష్ దర్యా, అవిన్ సాహూ ఉన్నారు. వారిని వారిని ముంబై లోని ఎస్ప్లానడ్ కోర్టులో హాజరు పర్చగా, కోర్టు వారికి ఈనెల 11 వరకుఎన్సీబీ కస్టడీ విధించింది. ఇటీవల ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ 10 మంది యువకులు , ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. వారి నుంచి డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో బాలీవుడ్ ప్రముఖ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ జరిపిన కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News